బేగంపేట ఆగస్ట్ 20,(జే ఎస్ డి ఎం న్యూస్) :
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని డా.కోట నీలిమ ఆన్నారు.ముందుగా ఆమె రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.రాజీవ్ గాంధీ జయంతిసందర్భంగా సనత్ నగర్ నియోజకవర్గం బేగంపేట డివిజన్ పరిధిలోని వికార్ నగర్ లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు విశాల్ సుధాం ,ఎం ఏ అజీజ్ (షాజహాన్) ల ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహించిన క్యారమ్స్ పోటీలలో విజేతలకు మొదటి బహుమతి రూ 10వేలు,ద్వితీయ బహుమతి రూ 5వేలు తో పాటు షీల్డ్ లు,మెడల్స్ ను కోట నీలిమ చేతుల మీదుగా అందించారు.ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.వారికి కోట నీలిమ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధి కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకొచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశాల్ సుదాం, బేగంపేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నసీరుద్దీన్ (అడ్డు)అజీజ్,చిరంజీవి, మహిళా నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


