వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు…..గాజుల అలంకరణలో మెరిసిపోయిన అమ్మవారు……వరలక్ష్మీ పూజలు చేసిన ఈ ఓ దంపతులు.

బేగంపేట ఆగస్ట్ 21,(జే ఎస్ డి ఎం న్యూస్)
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.గాజుల అలంకరణలో అమ్మవారు మురిసిపోయారు. ఈ సందర్భంగా ఈ ఓ గుత్తా మనోహర్ రెడ్డి దంపతులు వరలక్ష్మీ వ్రతం ,పూజలు నిర్వహించారు.శుక్రవారం,వరలక్ష్మీ వ్రతం కావడంతో మహిళలు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని అమ్మ వారికి పూజలు నిర్వహించారు.
కుంకుమార్చన చేశారు.దేవాలయాన్ని వివిధ రకాలైన పూలు,వివిధరకాలైన గాజులతో
అందంగా అలంకరించారు.
విద్యుత్ దీపాల వెలుగులో అమ్మవారు దగ ధగ మురిసిపోయారు. వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని దేవాలయాన్ని వివిధ రకాలైన పూలు, గాజులతో అలంకరించడం జరిగినదని ఆలయ కార్యనిర్వహణాధికాగుత్తా మనోహర్ రెడ్డి తెలియజేశారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా ఆలయంలో ముందస్తు ఏర్పాట్లు చేశామని ఈ ఓ తెలియ జేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *