అభివృద్దికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు- తాళ్లూరు మండల సర్వసభ్య సమావేశం నిర్వహణ- గత ఐదేళ్లలో తమ అనుభవాలను సభ దృష్టికి తెచ్చిన ప్రజా ప్రతినిధులు, అధికారులు

గత ఐదేళ్ల తమ పదవీ కాలంలో ప్రజా సమస్యలను నిత్యం తమతో పనిచేసి అభివృద్ధి, సంక్షేమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నట్లు ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు చెప్పారు. తాళ్లూరు మండల సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే తనకు ఎంపీపీ అవకాశం కల్పించిన రాజకీయ గురువులకు, పెద్దలకు కృతజ్ఞతలు చెప్పారు. వైస్ నర్పంచిగా తన రాజకీయ అరగ్రేటం చేసి మరింత సేవ చెయ్యాలన్న తపనతో మండల స్థాయి పదవి కోసం నిత్యం కష్టపడ్డామని చెప్పారు. తనకు రాజకీయ పాఠాలు నేర్పి, తనకు సహకరించిన జెడ్బీటీసీ మారం వెంకట రెడ్డితో పాటు రాజకీయ గురువులకు, నిత్యం తన వెన్నంటి ఉన్న ఎంపీటీసీలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి మాట్లాడుతూ తాను జెడ్పీటీసీగా పదేళ్ల పాటు పనిచేసి మండలంలో నిత్యం ప్రజల నమస్యలను తీర్చటానికి అధికారులతో మాట్లాడిన సమయంలో అధికారులు కూడ చక్కగా స్పందించారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. మిగిలిన మండలాలతో పోలిస్తే నర్వ సభ్య సమావేశం తాళ్లూరు మండలంలో చాలా ఖచ్చితంగా జరుగుతుందని, నభలో ప్రవేశానికి అర్హత లేని వారు ఎవరూ కూడ నభకు రారని ఇలాంటి సాంప్రదాయాన్ని కొనసాగించటం ఎంతో మంచిదని, సమస్యలను చర్చించటానికి మంచి వేదిక అని అన్నారు. వైస్ ఎంపీపీలు ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, మంచాల ప్రియాంక నాగార్జున రెడ్డిలు తమ అనుభవాలను వివరించారు. ఎంపీడీఓ అజిత, తహసీల్దార్ రమణా రావు, ఎంఈఓ లు జి సు బ్బయ్య, సుధాకర్ రావు, వ్యవసాయాధికారి ప్రసాద రావు, ఎపీఎం దేవరాజ్, ఎపీఓ వెంకటేశ్వర్లు, తమ అనుభవాలను, ప్రజా ప్రతినిధులు సమస్యలపై చిత్త శుద్దితో మాట్లాడిన విధానం ఎంతో హుందాగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. ప్రజా ప్రతినిధులతో మరొక సారి చివరి సభను అభినందన సభ నిర్వహించుకుందామని ఎంపీపీ చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *