బేగంపేట అక్టోబర్ 26(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
తాగునీటిని దుర్వినియోగం చేసినందుకు హోటల్ ప్యారడైజ్ యాజమాన్యానికి జలమండలి రూ.20 వేల జరిమానా విధించింది.ఖైరతాబాద్ జోన్ పరిధిలోని డివిజన్-16 అధికారులు నిర్వహించిన తనిఖీల్లో హోటల్ ప్యారడైజ్లో (CAN నంబర్:612182839) నీటి
దుర్వినియోగాన్ని గుర్తించారు. దీంతో రూ.20 వేల జరిమానావిధించడంతో పాటు
భవిష్యత్తులో నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని యాజమాన్యానికి సూచించారు.నీటి దుర్వినియోగానికి పాల్పడితే నిబంధనల ప్రకారం చర్యలుతీసుకుంటామని జలమండలి అధికారులు హెచ్చరించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: