ఏకకాలంలో వివిధ పంటలను వినూత్నంగా సాగు చేయటం అలవాటు చేసుకోవాలి – రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి.విజయ్ కుమార్

ఏకకాలంలో వివిధ పంటలను వినూత్నంగా సాగు చేయటం అలవాటు చేసుకోవాలని రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి.విజయ్ కుమార్ రైతులకు పిలుపునిచ్చారు. సోమవారం ప్రకాశం భవనంలో ప్రకృతి సాగు రైతులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారిలతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత ఎల్నినో నేపథ్యంలో రైతులకు ఆదాయం రావడంతో పాటు జిల్లాలో పశుగ్రాసానికి కొరత లేకుండా ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్లాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఈ దిశగా రైతులకు అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు. ప్రస్తుత పంటలలో అంతర పంటలను కూడా పెంచడం ద్వారా ఈ లక్ష్యాలను చేరుకోవచ్చు అన్నారు. ఈ క్రమంలో భూ సారాన్ని క్రమంగా తెలుసుకుంటూ సేంద్రియ ఎరువులను ఉపయోగించాలని ఆయన సూచించారు. సాగు చేయకుండా వదిలేసిన బంజరు భూములను ప్రకృతి సేద్యం విధానం ద్వారా వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా వాతావరణంలో ఉష్ణోగ్రతల తీవ్రతను తగ్గించవచ్చన్నారు. ప్రకృతి సంబంధిత ఎల్ నినో ప్రభావాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు రైతులకు ప్రకృతి సేద్య విధానమే ఉత్తమమని విజయ్ కుమార్ చెప్పారు. ఈ దిశగా రైతులను మరింత చైతన్యవంతం చేసేలా ప్రభుత్వం తగిన ఆదేశాలు జారీ చేసేలా చూస్తానన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పంటల సాగు తీరు, ప్రకృతి సేద్యం జరుగుతున్న విధానాన్ని వివరించారు. ప్రకృతి సేద్య విస్తీర్ణం మరింత పెరిగేలా చర్యలు తీసుకుంటామని, అంతర పంటల ప్రాధాన్యాన్ని విస్తృతంగా రైతుల్లోకి తీసుకువెళ్లేలా మరింత దృష్టి సారిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ప్రకృతి సేద్యం డిపిఎం సుభాషిణి, ఏపీఎంఐపి పిడి శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *