స్థానిక మామిడిపాలెంలోని ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు సోమవారం సందర్శించారు. నెలవారీ తనిఖీలలో భాగంగా వీటి షట్టర్లకు వేసిన తాళాలు, సీలును పరిశీలించారు. నిర్వహణకు సంబంధించిన రిజిస్టర్లను కూడా పరిశీలించారు. ఈ ప్రాంగణంలో కల్పిస్తున్న భద్రత, గోదాముల నిర్వహణ తీరుపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట జిల్లా ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు ఉన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: