హైదరాబాద్ అక్టోబర్ 28(జే ఎస్ డి ఎం న్యూస్ ) :అత్యధిక గ్రాడ్యుయేట్ లను ఓటర్లుగా నమోదు చేయించి సనత్ నగర్ నియోజకవర్గాన్ని ప్రధమ స్థానంలో నిలపాలనే కృతనిశ్చయంతో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కృషి చేస్తున్నారు. ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు పలు మార్లు నియోజకవర్గ స్థాయి పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశాలు నిర్వహించి ఓటరు నమోదు కార్యక్రమం గురించి దిశా నిర్ధేశం చేశారు. ఇంటింటికీ వెళ్ళి గ్రాడ్యుయేట్ లను గుర్తించి ఓటరుగా నమోదు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని పిలుపునివ్వడం జరిగింది. ప్రతిరోజు అన్ని డివిజన్ ల నాయకులతో రోజువారీ ఓటరు నమోదు కార్యక్రమంపై ఆరా తీస్తున్నారు. కాగా నమోదు కార్యక్రమం నవంబర్ 6 తో ముగియనున్నది. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో గ్రాడ్యుయేట్ లను ఓటరుగా నమోదు చేసే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేలా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాచరణను ప్రకటించారు. ఇందుకోసం ఈ నెల 30 వ తేదీ నుండి సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ లలో ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధం అవుతున్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన అన్ని డివిజన్ లలో ఇంటింటికీ వెళ్ళి అర్హులైన గ్రాడ్యుయేట్ లను ఓటరుగా నమోదు చేయిస్తారు.
కార్యక్రమాల వివరాలు.
ఈ నెల 30 వ తేదీన ఉదయం 9.00 గంటలకు రాంగోపాల్ పేట డివిజన్ లో, 9.30 గంటలకు బేగంపేట డివిజన్ లలో పర్యటించి ఇంటింటికీ వెళ్ళి గ్రాడ్యుయేట్ లను ఓటరుగా నమోదు చేయిస్తారు. అదేవిధంగా 31 వ తేదీన ఉదయం 9.30 గంటలకు బన్సీలాల్ పేట డివిజన్ లో, 10.00 గంటలకు మోండా డివిజన్ లో, 10.30 గంటలకు పద్మారావు నగర్ డివిజన్ లో, నవంబర్ 1 వ తేదీన ఉదయం 10.30 గంటలకు సనత్ నగర్ డివిజన్ లో, 11.00 గంటలకు అమీర్ పేట డివిజన్ లలో ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: