వైస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేదిలేదు….చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

సింగరాయకొండ : కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హెచ్చరించారు. కూటమి నాయకుల అరాచకాలను ఎండకడుతూ, కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని సింగరాయకొండ మండలం వైసీపీ క్యాంప్ కార్యాలయంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు మసనం వెంకటరావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్ సమావేశంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ సమయంలో కూటమి నాయకుల అరాచకాలపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూటమి నాయకులు చేసిన దౌర్జన్యాలపై ఆగ్రహించి మాట్లాడుతూ నామినేషన్ల సమయంలో కూటమి నాయకులు వైసీపీ నాయకులపై, కార్యకర్తలపై దాడులకు తెగబడి నామినేషన్ కాగితలను చించివేసి కొత్త సంస్కృతిని పరిచయం చేశారని,ఇదే సంస్కృతి తో ముందుకు పోవాలనుకునే కూటమి నాయకులకు ఇదే హెచ్చరిక, మా నాయకుడు చొక్కా మడత పెట్టేవరకు తెచ్చుకోవద్దని,మరో రెండు సంవత్సరాల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని, అప్పుడు నేడు వైసీపీ నాయకులపై దాడులకు తెగబడ్డ ప్రతి ఒక్కరూ గ్రామం వదిలి వెళ్ళవలసిందేనని,ఎవరిని వదిలేది లేదని, పోరాటాల పురిగడ్డ నుండి వచ్చిన ఆయన వైఎస్సార్ సీపీ పోరాటాలతో పైకొచ్చిన నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి అని,మా నాయకులపై దాడి చేసిన ప్రతి కూటమి నాయకులను డిజిటల్ బుక్ లోనే కాదు మైండు లో ఉంచుకుంటాం ఎవరిని వదలమని, ఊరి నుండి తరిమికొట్టె సమయము తొందరలో వస్తుందని, వైఎస్ఆర్సిపి అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి నాయకులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొండపి నియోజకవర్గ 6 మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *