సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి దసరాశరన్నవరాత్రుల హుండీ ఆదాయం రూ.42,23,963 లు….

బేగంపేట అక్టోబర్ 28 (జేఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి దసరాశరన్నవరాత్రుల హుండీ ఆదాయం రూ.42,23,963 లువచ్చినట్లు ఆలయ ఈవో వంగ అంబుజా తెలియజేశారు.
బుధవారం ఉదయం 9.30 గం.లకు అమ్మవారి దసరా నవరాత్రులకు సంబంధించిన హుండీలు (69 రోజులకు) సంబందించినవి లెక్కించారు.ఈ లెక్కింపు దేవాదాయ శాఖ సికింద్రాబాద్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి ఆలయ ఈ.ఓ. వంగ అంబూజ , ఫౌండర్ ఫ్యామిలి మెంబర్/చైర్మన్ . సురిటి. కామేశ్వర్ , శ్రీ. సురిటి. రామేశ్వర్ , ధర్మకర్తల మండలి సభ్యులు, మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు, బ్యాంక్ అధికారులు భక్తుల సమక్షములో వివిధ స్వచ్చంద సంస్థల నుండి వచ్చిన భక్తులు పాల్గొని అమ్మవారికి సమర్పించిన కానుకలను లెక్కించారు.
వాటిలో నోట్స్ రూ.39,66,745/-లు మరియు కాయిన్స్ రూ.2,57,218/-లు మొత్తము రూ.42,23,963లు ఆదాయం వచ్చింది. హుండీలో వచ్చిన మిశ్రమ బంగారం/వెండి దేవస్థానములోని హుండీలో భద్రపరచినట్లు ఈ ఓ తెలియ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *