తాళ్లూరు : తాళ్లూరు ఎంపీడీవో కార్యాలయం లో జడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాటు చేసినపోన్టల్ బ్యాలెట్ బాక్స్ నందు 47 మంది ఉద్యోగులు శనివారం పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. ఆర్వో దేవనహాయం ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేసి బ్యాలెట్ పత్రాలు అందజేశారు. వివిధ ప్రాంతాల్లో పోలింగ్ డ్యూటీలు వుండటంతో పోన్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. ఆర్వో గదిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సీల్ బాక్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కార్యక్రమంలో ఏఆర్వో పి.అజిత, డిప్యూటీ ఎంపీడీవో వి.శ్రీనివాసరావు, ఎంఈవో. జి. నుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: