తాళ్లూరు: తాళ్లూరు- కుంకుపాడు రోడ్డు నిర్మాణపనులు వేగవంతంగా పూర్తి చేస్తామని పం చాయతీ రాజ్ డీఈ మాధవరెడ్డి తెలిపారు. తాళ్లూరు-కుంకుపాడు మార్గంలో పీవీబీ రాంజీ పధకం కింద రూ2కోట్ల 45 లక్షలతో జరుగుతున్న రోడ్డు పనులను డీఈ శని వారం పరిశీలించారు. ఆమార్గంలో గల రజానగరం పంటకాలువ, రజానగరం మేజర్ సాగర్ కాలువ వద్ద వున్న రెండు పైపు లైన్ కల్వర్టు శిధిలమైనందున వాటి స్థానే కొత్త పైప్ లైన్ కల్వర్టులు నిర్మించనున్నట్లు తెలిపారు. అందుకు అంచనాలను సిద్ధం చేయాలని పంచాయతీ ఏఈకి సూచించారు. ఈరహదారి 25 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, అందులో 12 అడుగుల మేర బీటీ రోడ్డు నిర్మాణం వుంటుందన్నారు. గ్రామంలో రాములవారిగుడి వద్ద నుండి న్మశాన వాటిక వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేపడటం జరుగుందన్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో ఏఈ వెంకటేశ్వర్లు, వర్క్న్పెక్టర్ దేవా, ఐ.వి.రమణారెడ్డి, మారం రామ్మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: