నటుడు, దర్శకుడు, నిర్మాత కీర్తిశేషులు యర్ర గిరిబాబు కు ఘన నివాళి

నటుడు, దర్శకుడు, నిర్మాత కీర్తిశేషులు యర్ర గిరిబాబు యొక్క జ్ఞాపకార్థం సర్వజన కార్యక్రమం లో భాగంగా, ఆయన స్వగ్రామం రావినూతలకు దేశ, విదేశాల నుండి ఆయన అభిమానులు తరలివొచ్చిఘన నివాళి అర్పించారు . ఈ కార్యక్రమం లో, గిరిబాబు కుటుంబానికి సన్నిహితులైన ఉమ్మడి ప్రకాశం జిల్లా ( ఐ ఆర్ సి ఎస్ ) రెడ్ క్రాస్ ప్రతినిధి, మానవత స్వచ్చంద సేవా సంస్థ సెంట్రల్ కన్వీనర్ కపురం శ్రీనివాస రెడ్డి హాజరై గిరిబాబు చిత్రపటానికి పూలమాల వేసి,పుష్పాలతో అంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం,వర్ధమాన నటుడు, దివంగత గిరిబాబు తనయుడు రఘుబాబు ను వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా, దివంగత నటుడు గిరిబాబు గురించి కపురం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ….. ప్రకాశం జిల్లా ఆణిముత్యం, అద్దంకిసీమ ముద్దబిడ్డ గిరిబాబు సినిమా రంగంలో అంచెలంచెలుగా ఎదిగి, 650 చిత్రాల్లో నటించి,వీటిలో 100 సినిమాలకు కథానాయకుడి(హీరో)గా నటించి, దర్శకునిగా,నిర్మాతగా సినీ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరో హించారు. భౌతికంగా గిరిబాబు మన మధ్య లో లేకపోయినప్పటికి,ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుని అందరికీ చిరస్మరణీయుడయ్యడని, ఆయన సినిమా రంగానికి చేసిన సేవలను కొనియాడారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *