డిలిమిటేషన్ జరిగితే అతి తక్కువగా 190 సీట్లు దక్షిణ భారతదేశానికి వస్తుందని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ అన్నారు. స్థానిక హోటల్ సరోవర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో చింతామోహన్ మాట్లాడుతూ డీ లిమిటేషన్ జరిగితే ఉత్తర భారతదేశానికి 600 పైగా సీట్లు పోతుందన్నారు. కేంద్ర క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రి వర్గ సభ్యులకు పైపైగా సమాచారం చెప్పారన్నారు.మోడీ, అమిత్ షాలే మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటున్నారు.కాంగ్రెస్ పార్టీ వల్ల ఎదిగిన చంద్రబాబు, ఇప్పుడు బిజెపికి సపోర్టు చేయడం మంచి పద్ధతి కాదు. నా మిత్రుడు కుమారుడు జగన్ తలుపు సందులో వేలు పెట్టి, ఇప్పటికీ విడిపించుకోలేక తనకలాడుతున్నాడు.ఆఘమేఘాలపై ప్రత్యేక విమానంలో వెళ్లి, ఢిల్లీలో దేవెగౌడ కుమారుడు, కుమార స్వామితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేయాల్సి అవసరం ఏమొచ్చింది? జగన్ లాగా, చంద్రబాబు కూడా ఎక్కడో తలుపు సందులో వేలు పెట్టాడేమోనని డౌట్ వచ్చింది.కపిల్ సిబల్ చెప్పిన మాటలను నేను పూర్తిగా సమర్థిస్తున్నారు.ప్రమాదపు అంచుల్లో భారతదేశం వుంది. దేశ భక్తి కలిగిన ప్రతి పౌరుడు ఈ సందర్భంగా స్పందించాలన్నారు.ఉత్తర భారతదేళం, దక్షిణ భారతదేశం రెండుగా చీలిపోయే ప్రమాదం లేకపోలేదన్నారు.ధరలు ఆకాశాన్ని తాకుతోంది. సామాన్యుడు కొనలేక, ఒక్క పూట కూడా మంచి తిండి తినలేక పస్తులతో పడుకుంటున్నారన్నారు.కాంగ్రెస్ హయాంలో కిలో బియ్యం ధర రూ.20/ బిజెపి పాలనలో కిలో బియ్యం ధర రూ.100/ లీటరు పెట్రోలు కాంగ్రెస్ పాలనలో రూ. 60/ ఇప్పుడు బిజెపి ప్రభుత్వంలో రూ. 120/ పెరిగింది లీటరు పెట్రోల్ అన్నారు.చీమకుర్తి గనుల్లో ఒక్క ఓబీసీకైనా, ఒక్క ఎస్సీకైనా ఇచ్చారా? ఆయన ప్రశ్నించారు.వేలాది ఎకరాలు భూములు పెట్టుబడిదాలను ఇస్తున్నారన్నారు.టైటిల్ డీడ్ ప్రభుత్వం చేతుల్లో ఉండాలి. భూములు పొందిన కంపెనీల చేతుల్లోకి ఎందుకు ఇచ్చారు? అన్నారు.పక్క రాష్ట్రం తమిళనాడులో టైటిల్ డీడ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో వుంది. ఏపీలో ఎందుకు లేదు? అన్నారు.టైటిల్ డీడ్ కంపెనీల చేతుల్లోకి వెళ్ళడం వల్ల, బ్యాంకుల్లో భూములు కుదువ పెట్టి, వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంటున్నారన్నారు.10% కూడా పెట్టుపడులు పెట్టడం లేదు. ఉద్యోగాలు రావడం లేదన్నారు.అందరు ప్రధానులు కలసి రూ. 50 కోట్ల రూపాయలు విదేశీ అప్పులు చేశారన్నారు.మోడీ ఒక్కరే గత 12 ఏళ్ల కాలంలో 150 కోట్ల రూపాయలు విదేశీ అప్పులు చేశారు. జిఎస్టి సేల్ టాక్స్, ఇన్కమ్ టాక్స్, రోడ్డు టాక్స్, ఇడ్లీపై, దోసెపైన, హేయిర్ కటింగ్ పైన పన్నులు భారం చేస్తున్నారన్నారు.విదేశీ అప్పులు వల్ల వచ్చిన డబ్బు, ఇండియాలో పన్నులు ద్వారా వచ్చిన ఆదాయం ఏమి చేశారు? ఎక్కడ ఖర్చు చేశారో దేశ ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారన్నారు.ఈ విలేకరులు సమావేశంలో పాలడుగు విజయేంద్ర, ఏడుకొండల రావు, సుదర్శన్, లక్ష్మీ నారాయణ, క్రిష్టా రావు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: