జగనన్న గృహాలు లక్ష్యం మేరకు కృషి చెయ్యాలని మండల ప్రత్యేక
అధికారి ఉపేంద్రకుమార్ అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో
మంగళవారం జగనన్న కాలనీలలో గృహ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. లబ్దిదారులతో మాట్లాడి ఉగాది నాటికి పూర్తి అయ్యేలా చూడాలని కోరారు. పంచాయితీల వారిగా గృహ నిర్మాణాల పురోగతిపై గృహ నిర్మాణ శాఖ అధికారులతో, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్‌తో సమీక్ష నిర్వహించారు.
ఎంపీడీఓ కైవై కర్తి, హౌసింగ్ ఎఈ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యాల మేరకు గృహాలు పూర్తి చెయ్యాలి-మండల ప్రత్యేక అధికారి ఉపేంద్రకుమార్
21
Feb