మాతృభాషా జాతికి ప్రాణం వంటిదని భాష అంతరిస్తే జాతి అంతరించినట్లేనని ప్రధానోపాధ్యాయురాలు ఎన్ అరుణ కుమారి అన్నారు. మండలంలోని శంకరాపురం . పెదవులగల్లు ప్రాథమిక పాఠశాలలో మంగళవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు,పెదఉల్లగల్లు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం సునీత మాట్లాడుతూ మాతృభాష మాధ్యమాన్ని కోల్పోతే మన సంస్కృతిని కోల్పోయినట్లేనని అన్నారు, అనంతరం తెలుగు తల్లి గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు, తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నమస్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి వి సుబ్బరాజు, మువ్వా శ్రీనివాసరావు , కేకే కుమార్ , ఉదయలక్ష్మి , విజయలక్ష్మి , నిరంజన్. , సలోమి , కాటి అంకమ్మ , సుగుణావతి , సుధారాణి , రాజబాబు , కిరణ్ కుమారి, ఆండాలమ్మ తదితరులు పాల్గొన్నారు.
