ప్రజలకు మెరుగైన వైద్య సేవలు

గ్రామాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 104 వాహనం ద్వారా ఫ్యామిలీ ఫిజీషియన్ తో డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నందు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని వైద్యాధికారి సిహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మండలంలోని మారేళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో గల జమ్మలమడక గ్రామంలో శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలందరూ మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే వ్యాధులు దరి చేరవు అన్నారు. మీ ఇంటి లో నీటి తొట్లను వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలన్నారు. అలా చేయని యెడల నీటి తొట్ల లో లార్వా వృద్ధి చెంది వ్యాధులు వస్తాయన్నారు రాత్రులు దోమల బెడద నుండి దోమతెరలు వాడాలన్నారు. ఈ శిబిరంలో 55మందికి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ వెంకటరావు, డీఈవో, వెంకట ప్రసాద్, ఏఎన్ఎం పద్మాంజలి, మస్తానమ్మ, గృహలక్ష్మి, రొంపిచర్ల వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *