నాటి పాలన కంటే -నేటి పాలన భేష్ – ప్రజలకు ప్రభుత్వం చేసిన మేలును తెలియజేయాలి – ప్రచార సామగ్రిని విడుదల చేసిన ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్

గత ప్రభుత్వ పాలన కంటే ప్రస్తుత ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న పాలన బాగుందని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. సచివాలయ కన్వీనర్లు, వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ స్థాయి నుం చి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి సమస్యల పై ప్రత్యేక దృష్టి పెట్టి తమ దృష్టికి తీసుకు రావాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంతో నియోజకవర్గ స్థాయి సచివాలయ కన్వీనర్లు, ముఖ్యనాయకులతో గురువారం ఆయన సమావేశ మయ్యారు. జగనన్నే మా భవిష్యత్.. మా నమ్మకం నువ్వే జగనన్న వాల్ పోస్టర్లను ఎమ్మెల్యే విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ పాలన ఎలా ఉంది..? గత టీడీపీ పాలన ఎలా ఉందో ఒకసారి ప్రజలు, నాయకులు, కార్యక ర్తలు గుర్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *