కురిచేడు మండలంలోని గంగదొనకొండలో వేంచేసి వున్న శ్రీ గంగాభవాని అమ్మవారి తిరునాల ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వైఎస్ఆర్సిపి నాయకుడు డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఎడ్ల బండలాగుడు పోటీలను ప్రారంభించారు. మూడు విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
కార్యక్రమంలో జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ షేక్ సైదా ,ఏఎంసీ చైర్మన్ వైవీ సుబ్బయ్య, మేరువ పిచ్చిరెడ్డి, వేమా శ్రీనివాసులు, మేరువ సుబ్బారెడ్డి, బెల్లం చంద్రశేఖర్, గోదల సుబ్బారెడ్డి, అందె సుబ్బారెడ్డి, కండె గంగయ్య, చౌడయ్య, వెంకటరెడ్డి, ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.


