భారీగానాస్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (NDPL)స్వాదీనం-ఒక కారు, ఒక ద్విచక్ర వాహనంతో సహా 54 కేసులు- గోవా మరియు హర్యానా రాష్ట్రాల మద్యం స్వాదీనం

పోరుగుమద్యం(NDPL), గంజాయి, నాటుసారాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్ధాలను ఎట్టి పరిస్థితులలో సహించేది లేదని దర్శి ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎ. ఆవులయ్య పేర్కొన్నారు. ఆదివారం దర్శి సెబ్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశములో స్థానిక ఇన్స్పెక్టర్ బి. సుందర రామయ్య తో కలసి ఆయన మాట్లాడారు. ప్రకాశం జిల్లా యస్.పి. మలికా గర్గ్ , Addl. SP నాగేశ్వర రావు ల ఆదేశాల మేరకు ఈ నెల 8 న శనివారం తాళ్ళూరు మండలం గుంటి గంగమ్మ అమ్మ వారి తిరునాళ్ళ వద్ద మద్యం అమ్ముతున్న స్థానిక రామభద్రాపుం గ్రామస్తులు పులి కృష్ణారెడ్డి, గంగిరెడ్డి సుబ్బారెడ్డి మరియు తూర్పు గంగవరం గ్రామానికి చెందిన గుజ్జుల బాల కృష్ణారెడ్డి లను దర్శి సెబ్ స్టేషన్ సిబ్బంది చాకచక్యంగా పట్టుకుని వారి నుంచి 60 మద్యం సీసాలు (750 యం.యల్. పరిమాణము ము గల), సదరు మద్యాన్ని పంపిణీ చేసేందుకు ఉపయోగిస్తున్న Honda Shine ద్విచక్ర వాహనాన్ని పట్టుకోవడము జరిగిందని వెల్లడించారు. పట్టుబడ్డ ముద్దాయిలు ఇచ్చిన సమాచారము మేరకు ఒంగోలు AES సుదీర్ బాబు ఆధ్వర్యములో ఆకస్మిక దాడులుచేసి నెల్లూరు ధనలక్ష్మిపురం నివాసి యస్.వి. రాఘవేంద్ర ,శ్రవణ్ కుమార్ ల ను అదుపులోకి తీసుకుని అతను నిల్వ చేసిన 49 కేసుల(750 యం.యల్. పరిమాణము ము గల 588 మద్యం సీసాలు) మద్యాన్ని, 02 కే.జి ల గంజాయిని, మొత్తం 648 ఫుల్ బాటిల్స్ సరకు రవాణాకు ఉపయోగిస్తున్న hyundai i 20 కారును సీజ్ చేయడం జరిగిందన్నారు. ఈ దాడులలో పాల్గొన్న చీమకుర్తి seb యస్.ఐ యం. నగేష్, దర్శి సెట్ కానిస్టేబుల్స్ షేక్. హబీబ్ బాషా, యస్.కె. బాషా, దస్తగిరి, సుబ్బారావు, డి.టి.యఫ్ కానిస్టేబుల్ యస్.శ్రీనివాస్, కె.వి. రామిరెడ్డి లను అభినందిస్తున్నట్టు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *