డిఎస్సి-1998 అభ్యర్థులకుమినిమం టైం స్కేల్ -12, 13 తేదీల్లో కౌన్సెలింగ్-పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు

డిఎస్సి 1998లోఅర్హత సాధించిన 4,072 మందిని కాంట్రాక్టు విధానంలో రాష్ట్రప్రభుత్వం ఉపాధ్యాయులుగా నియమించనుంది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ కమిషనరు ఎస్ సురేష్ కుమార్ ఆదేశాలతోపాటు కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేశారు. మినిమం టైమ్స్కేల్ (ఎంటిఎస్) విధానంలో వీరికి వేతనాలివ్వాలని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. వయసు 60 ఏళ్లలోపు ఉన్నవారిని మాత్రమే తీసుకోవాలని ఆదేశించింది. ఒప్పంద నిబంధనల ప్రకారం సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎసిటి)గా నియమించాలని పేర్కొంది. బిఇడి అర్హతతో నియామకాలు పొందిన అభ్యర్థులు ఆరు నెలల ప్రాథమిక విద్య బ్రిడ్జి కోర్సును ఏడాదిలోపు పూర్తిచేయాలని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లోని అదనపు పోస్టులను ఇతర జిల్లాల్లో సర్దుబాటు చేశారు. విద్యార్థుల సంఖ్య 20 నుంచి 30లోపు ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలల్లో మాత్రమే అభ్యర్థులను నియమించాలి. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా, ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉన్నచోటకు వీరిని పంపాలి. ఈ నెల 10వ తేదీన జిల్లాల వారీ డిఎస్సి – 1998 అభ్యర్థుల వివరాలను అధికారులు నిర్ధారించుకుని, 11వ తేదీన వారికి సమాచారం అందించాలి. 12, 13 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించి, అభ్యర్థులకు పోస్టింగు ఉత్తర్వులు ఇవ్వాలి. ఫిర్యాదులుంటే ఈ నెల 14వ తేదీలోపు పాఠశాల విద్యాశాఖ కమిషనరుకు పంపించాలి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *