వాణిజ్య వ్యాపార పంటల సాగుతో ఆటుపోట్లతో విసిగి వేసారిన రైతాంగానికి గత సంవత్సరం కాలంలో కరివేపాకు ధర ఆశాజనకంగా ఉండడంతో రైతన్నలు కరివేపాకు సాగుపై ఆసక్తి చూపారు. ముండ్లమూరు మండలంలో 200 ఎకరాల వరకు సాగు చేశారు. అయితే గత జనవరి నెలలో కరివేపాకు కు మంచి డిమాండ్ ఉండటంతో పాటు ధర ఉండటంతో మంచి మార్కెట్ ధర పలకడంతో రైతన్న లో హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో ఒక్కసారిగా ధర అమాంతం తగ్గడంతో రైతన్న లో తీవ్ర నిరాశకు లోనైనారు. వివరాల్లోకి వెళితే జనవరి కి ముందు ఎకరా కరివేపాకు సాగు చేసిన రైతులకు మంచి ఆదాయం లభించడంతో రైతులు కరివేపాకు సాగుపై మొగ్గు చూపారు. ఎకరాకు విత్తనాలు క్వింటా ధర 15 వేల నుండి 30 వేల వరకు ఉంటుంది. వ్యవసాయం ఆరు నుండి ఏడు సార్లు చేస్తే, డ్రిప్ తో సహా ఎకరానికి లక్ష ఖర్చు అవుతుంది. మూడు నెలలకు ఒకసారి కోత వస్తుంది. ఇలా సంవత్సరానికి నాలుగు కోతలు దిగుబడితో ఒక కోతకు ఐదు టన్నుల లెక్కన సంవత్సరానికి 20 టన్నుల వరకు వస్తుంది. గత జనవరి నెలలో టన్ను 38వేల నుండి 40 వేల వరకు ధర పలికింది. దీంతో ఎకరానికి మూ డు లక్షల నుండి నాలుగు లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఎకరానికి మొదటి సంవత్సరం పెట్టుబడి లక్ష ఉంటుంది. రెండవ సంవత్సరం 30 వేలు మూడవ సంవత్సరం 20 వేలు ఉంటుంది. ప్రస్తుతం ఏప్రిల్ నెలలో ధర అమాంతం పడిపోయి పదిహేను వేల నుండి 20వేల వరకు ధర పతనం అయింది.


ఎప్పుడు ఇంత ధర తగ్గలేదు– మేడగం నారాయణమ్మ పసుపుగల్లు.
10సంవత్సరాల నుండి కరివేపాకు సాగు చేస్తున్నాను. జనవరి నెలలో పలికినంత ధర ఎప్పుడు చూడలేదు. ఒక ఎకరా లో సాగు మొదలుపెట్టి ఆరు ఎకరాల లో సాగు చేస్తున్న, డిసెంబరు, జనవరి నెలలో గిరాకీ ఉండడంతో ఉండడంతో టన్ను 38 వేల నుండి 40 వేల వరకు పలికింది. ఇదే ధర ఉంటే ఎకరాకు పెట్టుబడి పోను 3 లక్షల నుండి నాలుగు లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఉన్నట్టుండి ఏప్రిల్ నెలలో టన్ను కరివేపాకు రెండు వేలకు ధర పతనమైంది. దీంతో ఒక్కోసారి వ్యాపారాలు అడగడం లేదని రైతులకు తెలుపుతున్నారు

నష్టాల బాటలో ఉన్నాం – మేడగం జయరాం రెడ్డి పసుపుగల్లు,
నాలుగు ఎకరాల్లో కరివేపాకు సాగు చేశా అధికారులు సూచనలు సలహాలతో మెలుకువలు పాటిస్తూ వ్యవసాయం చేస్తున్నను. వ్యాపారు లు తోటల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ధర పతనంతో గిట్టుబాటు ధర తగ్గింది. జనవరిలో నెలలో పలికిన ధర లేకపోవడంతో రైతులు నష్టాల బాటలో ఉన్నారు. సాగు చేసిన కరివేపాకు ఇతర రాష్ట్రాలకు వెళుతుంది. నేడు అడిగేవారే కరువయ్యారు. టన్ను 2000 ధర ఉండటంతో రైతు లు నష్టాల బాటలో పయనిస్తున్నారు.