ముండ్లమూరు మండలంలోని జమ్మలమడక ఆంజనేయస్వామి తిరునాళ్ల సం దర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రాసాదరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక ఆలయంలో గ్రామస్తులతో కలిసి కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యకర్తలు అభిమానులు వారికి ఘన స్వాగతం పలికారు.


