స్వామి ఆశీస్సులతో ప్రజలు రైతులు సుభిక్షంగా ఉండాలి – జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ – నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి

స్వామి ఆశీస్సులతో ప్రజలు రైతులు సుభిక్షంగా ఉండాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్
బూచేపల్లి వెంకాయమ్మ,
దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి లు అన్నారు . ముండ్లమూరు మండలంలోని ఉమామహేశ్వర పురం (అగ్రహారం) గ్రామంలో ఆది వారం సీతారామస్వామి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండి రైతులు అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. ఇలాగే కొనసాగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులు ఐక్యంగా రాజకీయాలకు కులమతాలకు అతీతంగా ఒక తాటిపై నిలవడం సంతోషకరమన్నారు. ముందుగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికి దేవాలయం వద్దకు తీసుకువెళ్లారు. పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బంకా రమణమ్మ నాగిరెడ్డి, పసుపు గళ్ళు మాజీ సర్పంచ్ చింతా శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు మేకల వెంకటేశ్వర రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు ఇరుగుల కొండారెడ్డి, పసుపు గళ్ళువైస్ సర్పంచ్ బిజ్జం జ్యోతి కృష్ణారెడ్డి .వై సిపి సీనియర్ నాయకులు అబ్బని అంజి రెడ్డి, వైసిపి మండల యువ నాయకులు మందలపు అశోక్, గూడాల సుబ్బారెడ్డి, ఆదర్శ పాఠశాల చైర్మన్ బిజ్జం సుబ్బారెడ్డి, ఉలగల్లు మాజీ సర్పంచి గొంది వెంకట అప్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *