పాపినేని రామారావుకు ఆత్మీయ సన్మానము – డిపార్ట్మెంట్లో ఆయన చేసిన సేవలు అమోఘం – ప్రజలతో ఆయన సంబంధాలు అందరికీ ఆదర్శప్రాయం

ఎస్సై పాపినేని రామారావు పోలీస్ విభాగంలో వివిధ హోదాల్లో చేసిన సేవలు అమోఘమని వక్తలు అన్నారు. స్వచ్ఛంద పదవి విరమణ చేసిన పాపినేని రామారావుకు ఆయన స్వగ్రామం పొందూరులో ఆదివారం రాత్రి బంధువులు స్నేహితులు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ… ఆయన పోలీసు విభాగంలో నాలుగు దశాబ్దాల పాటు వివిధ హోదాలలో పనిచేసినప్పటికీ ప్రజలలో నిత్యం ఒక్కడిగా ఉంటూ వారి కష్టసుఖాలను పంచుకునే వారని అన్నారు. అదేవిధంగా ప్రజల నాడిని ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు తెలియజేసే ఇంటలిజెన్స్ విభాగంలో ఎంతో కీలకంగా పనిచేశారని గుర్తు చేశారు. అనంతరం రామారావు దంపతులను ఘనంగా సత్కరించారు. పలువురు ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *