పదో తరగతి అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసింది. వచ్చే జూన్ రెండో తేదీ నుండి పదో తేదీ వరకు పరీక్షలు జరుగుతాయ ని తెలిపారు.
రెండో తేదీన తెలుగు, మూడో తేదీన హిందీ, ఐదో తేదీన ఇంగ్లీష్ పరీక్షలు జరుగుతాయి. ఆరో తేదీన మేధమేటిక్స్, ఏడో తేదీన సైన్స్, ఎని మిదో తేదీన సోషల్స్టడీస్ పేపర్లకు పరీక్షలు జరుగుతాయి. 9,10 తేదీల్లో సంస్కృతం, ఆరేబియన్, పర్షియ్ భాషలకు సంబంధించిన పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ఉదయం 9.30 గంటల నుండి 12.45 నిమిషాల వరకు జరుగుతుంది. విద్యార్ధులు తొమ్మిది గంటల కల్లా వారికి కేటాయించిన సీట్లో వచ్చి కూర్చోవాలి.
పది’ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
08
May