*అద్దంకిలో ఏక్ నిరంజన్ కానిస్టేబుల్ హవా…!*

*సాటి పోలీస్ వారు అతన్ని యూనిఫామ్ లో చూసి సంవత్సరాలు గడుస్తున్నాయి*

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

*మండల స్థాయిలో ఏ కార్యాక్రమం అయినా మామూలు మాత్రం మనవాడికి అందాల్సిందే.*

*ఒకే స్టేషన్ లో భార్యా భర్తలు కొలువులు*

Jsdm-బాపట్ల ప్రతినిధి :

      బాపట్ల జిల్లా *అద్దంకిలో* నియంతగా మారిన కానిస్టేబుల్ వేజర్ల విద్యాసాగర్. ఇతనికి *ఏక్ నిరంజన్* అనే పేరు కూడా కలదు. మండలంలో ఏ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమ నిర్వాహకులు మన ఏక్ నిరంజన్ కు ముడుపులు ఇవ్వవలసిందే. గత రెండు సంవత్సరాల నుండి మండలం లోని బెల్ట్ షాప్ ల దగ్గర నెలకు మూడు వేల నుండి నలుగు వేలు రూపాయలు పై అధికారులకి ఇవ్వాలని డిమాండ్ చేసి మరి వసూలు చేస్తున్నట్టుగా మండల బెల్ట్ షాప్ ల వాళ్ళ బాహాటంగా చెప్పుకుంటున్నారు. కొందరు బెల్ట్ షాపుల వాళ్ళు మన వాడి వీడియోలు, ఫోన్ కాల్స్ ని కూడా రికార్డు చేయటం జరిగింది. అద్దంకి స్టేషన్ కి ఎంత పవర్ ఫుల్ అధికారులు వచ్చినా మనవాడి హవా మాత్రం తగ్గలేదు. ఏం మాయ చేస్తాడో తెలీదు ఆ అధికారులు  మనవాడు చెప్పినట్టు వినాల్సిందే.
ఇటీవల పోలీస్ స్టేషన్ లో కూడా దళిత సామాజిక వర్గ పోరు తీసుకురావటంలో ప్రధాన పాత్ర  పోషిస్తు, మరో దళిత కానిస్టేబుల్ పై ఈ అభియోగాలు మోపాలని చెసిన కుట్ర విఫలమైనదని స్టేషన్ లో వినికిడి.

గతంలో కూడా ఈవిషయాలపై మీడియా ప్రతినిధులు హెచ్చరికలు చేసినప్పటికి, పై అధికారుల అండ దండలతో ఆడిందే ఆటగా పాడిందే పాటగా, *డాన్స్ పార్టీలు నిర్వహణతో పాటు, మంచిగా డాన్స్ కూడా చేస్తూ ఎంజాయ్ చేయటం మన వాడి ప్రత్యేకత.* శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తు విధులు నిర్వర్తిస్తున్న మన విద్యా సాగారుడిని ఆపేవారు లేరా అని అద్దంకి మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.







Leave a Reply

Your email address will not be published. Required fields are marked *