బస్సులలో చోరీలకు పాల్పడుతున్న మహిళ ఆరెస్ట్ – రూ.7.80లక్షల విలువైన రూ. 13 సవర్ల బంగారం రికవరీ – ముద్దాయి అరెస్ట్

బస్సులలో చోరీకి పాల్పడుతున్న మహిళా దొంగను దర్శి పోలీసులు చాక చ క్యంగా పట్టుకుని ఆమె వద్ద నుండి రూ. 7.80లక్షల విలువైన 13 సవర్ల బంగారం రికవరీ చేసారు. పోలీసుల కథనం ప్రకారం …. ఏప్రియల్ ఆరవ తేదిన అద్దంకి నుండి దర్శి వస్తున్న పాణేం ముంతాజ బ్యాగ్ చోరికి గురైనది. అందులో 12 సవర్ల బంగారం ఉన్నట్లు బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. దీంతో కేసు నమోదు చేసిన ఎస్సై రామక్రిష్ణ డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ రామకోటయ్య పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో దర్యాప్తు మొదలు పెట్టారు. దీంతో దర్శి పట్టణంలో ఎపీఎస్ఆర్టీసీ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న చీరాల ఆదినారాయణ పురం ( సాయినగర్) కు చెందిన సాతుపాటి కుమారిని అరెస్ట్ చేసి విచారించారు. ఆమె వద్ద నుండి రూ. 17.80లక్షల విలువైన 13 సంవర్ల బంగారంను స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిని దర్శి కోర్టులో హాజరు పరుచగా రిమాండ్ విధించారు. కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన సీఐ రామకోటయ్య, ఎస్సై రామక్రిష్ణ, కానిస్టేబుల్స్ విజయ్, శేషగిరిలను డీఎస్పీ అశోక్ వర్థన్ అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *