తల్లిదండ్రులతో పాటు దుకాణానికి వచ్చిన మూడున్నర ఏళ్ల బాబు తప్పిపోవడంతో విషయాన్ని దర్శి ఎస్సై రామకృష్ణ దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే స్పందించిన ఎస్సై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పది నిమిషాల్లో బాబును తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. …
దర్శి మండలం లంకోజన పల్లి గ్రామానికి చెందిన కత్తి ఆంజనేయులు మరియు అతని భార్య శ్రీలత దర్శి పట్టణానికి కి నిత్యవసరాలు తీసుకోవడానికి తన మూడున్నర సంవత్సరాల కొడుకు కత్తి నాగశౌర్యతో పాటు వచ్చి ఫ్యాన్సీ షాపులో వస్తువులు కొనుగోలు చేస్తుండగా మూడున్నర సంవత్సరాల బాబు నాగశౌర్య పొరపాటున బయటికి వచ్చి కనిపించకుండా పోయాడు . సదరు విషయం కత్తి ఆంజనేయులు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయగా దర్శి ఎస్ఐ రామకృష్ణ మూడు టీములు ఎర్పాటు చేసి వెంటనే తప్పిపోయిన నాగ శౌర్య గుర్తించి తల్లిదండ్రులకి చెంతకు చేర్చడం జరిగింది. తక్షణమే స్పందించి బాబును వెతికి తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఎస్సై రామకృష్ణ బృందానికి తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తప్పిపోయిన బాలుడుని పది నిమిషాల్లో కనుగొని తల్లిదండ్రుల వద్దకు చెంతకు చేర్చిన దర్శి పోలీస్ లు – కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు
23
May