హత్య చేసిన నలుగురికీ వివేకాతో వేర్వేరు వైరుధ్యాలున్నాయి…
-గంగిరెడ్డిని వివేకా పలుమార్లు అందరిముందు తిట్టడంతోపాటు రియల్ ఎస్టేట్ సెటిల్ మెంట్ లావాదేవీల్లో విభేదాలు వచ్చాయి…
-సునీల్ యాదవ్ తనకు బెంగుళూరు సెటిల్ మెంట్ లో డబ్బులు రాలేదని వివేకాపై ఆగ్రహంగా ఉన్నాడు -హైకోర్టు..
-సునీల్ యాదవ్ కు వివేకాకు మధ్య రంగురాళ్లు వజ్రాల లావాదేవీల విషయంలో విభేదాలు వచ్చాయి
-తన తల్లిపై వివేకా తప్పుడు ఆలోచనలతో ఉన్నాడని వివేకాపై సునీల్ యాదవ్ పగ పెంచుకున్నాడు…
-వివేకా తనకు సర్పంచ్ ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదని ఉమాశంకర్ రెడ్డి కోపం పెంచుకున్నాడు…
-తనను డ్రైవర్ గా తొలగించడంతోపాటు ఓ మహిళతో అక్రమ సంబందంపై దస్తగిరికి వివేకాకు శత్రుత్వం ఉంది…
-వివేకా హత్య కేసులో ముందుగా టీడీపీ నేత ఆదినారాయణరెడ్డిపై అనుమానాలు వచ్చాయి…
-వివేకాను కుటుంబసభ్యులే హత్య చేశారని అప్పట్లో చంద్రబాబు ప్రకటన చేశారు…