లక్కవరంలో వ్యక్తిపై యువకుడు దాడి – కేసు నమోదు

తాళ్లూరు మండలం లక్కవరం గ్రామంలో ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని కత్తితో దాడి చేసిన సంఘటన చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం…..
లక్కవరం గ్రామానికి చెందిన పేరం వెంకటేశ్వర రెడ్డి ఉన్నత విద్యను అభ్యసించి సాఫ్ట్వేర్ ఉద్యోగం పోగొట్టుకుని ఇటీవల వారి సమీప బంధువైన మాజీ సర్పంచి టీవీ సుబ్బారెడ్డి వారి తమ్ముళ్లు తన ఉద్యోగం పోవటానికి, తనకు పెళ్లి సంబంధాలు రాక పోవటానికి కారణమంటూ వ్యక్తి గత కక్ష్య పెంచుకున్నారు. ఈవిషయం మాజీ సర్పంచి తల్లిదండ్రులు కామిరెడ్డి, అంజమ్మల నివాసం వద్దకు వెళ్లి మీ కుమారుడు ఎక్కడికి వెళ్లాడంటూ వాకబు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తాడు. దీంతో సమీపంలో ఉన్న మాజీ సర్పంచి టీవీ సుబ్బారెడ్డి అనుచరుడు సుబ్బారెడ్డి ఎందుకు ఇక్కడికి వచ్చావంటూ అడ్డుకోబోగా కత్తితో సుబ్బారెడ్డిపై దాడి చేయగా కుడిచేతి మణికట్టుపై రక్త గాయాలైనాయి. బాధితుడు కేకలు వేయగా చుట్టుప్రక్కల ప్రజలు వచ్చి అడ్డుకున్నారు. ఎస్సై ప్రేమక్కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితుని వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *