ప్రజలకు జగనన్న సురక్ష పథకం ద్వారా సత్వర సేవలు-డిపివో నారాయణరెడ్డి

ప్రభుత్వం ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించి అందిస్తున్న సేవలతో పాటు ప్రజల అవసరాలను వాలంటీర్ల సహకారంతో గుర్తించి జగనన్న సురక్ష పథకం ద్వారా సత్వరసేవలు అందింస్తుందని జిల్లా పంచాయతీ అధికారి జి.వి. నారాయణరెడ్డి అన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా తాళ్లూరు-1, తాళ్లూరు -2 సచివాలయాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంప్ ల్లో లబ్ధిదారులకు పలురకాల సర్టిఫికేట్స్ శనివారం పంపిణీ చేశారు. గ్రామసర్పంచ్ లు చార్లెస్ సర్జన్, కె.శ్రీదేవి అధ్యక్షతన జరిగిన సభల్లో డీపీవో నారాయణ రెడ్డి మాట్లాడుతూ….. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ప్రజలకు అనేక రకాల పథకాల నుండి లబ్ధిదారులకు చేయూత నిస్తుందన్నారు. పలుగృహాల్లో ప్రభుత్వ పరంగా అందాల్సిన సేవలు అందకుంటే
వాలంటీర్లు ఇంటింటికి తిరిగి గుర్తించి నమోదు చేశారని, లబ్ధిదారులను నిత్యం కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా జగనన్న సురక్ష క్యాంపులందు ఎలాంటి సర్వీస్ చార్జీలు లేకుండా అందిస్తున్నట్లు తెలిపారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు మాట్లాడుతూ… సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా ప్రతినిధులకంటే వలంటీర్లకు అధికప్రాధాన్యతనిచ్చి వారిచేతనే అన్నికార్యక్రమాలు చేయిస్తున్నారని, రానున్న
ఎన్నికల్లో వలంటీర్లు పార్టీకి అండగా నిలవాలన్నారు. ఎంతో ఖర్చుపెట్టి ప్రజాప్రతి నిధులై తెల్లటి దుస్తులు ధరించి కార్యక్రమాల్లో పాల్గొన్నా ఎమ్మెల్యే కూడా ప్రభుత్వం కార్యక్రమాల గురించి వాలంటీర్లను మాత్రమే అడుగుతున్నారంటే వాలంటీర్లకు
కార్యక్రమాల గురించి వలంటీర్లను మాత్రమే అడుగుతున్నారంటే వలంటీర్లకు సీఎం జగన్ ఎంత ప్రాధాన్యత నిచ్చారో గుర్తించాలన్నారు. జడ్పీటీసీ మారం వెం కటరెడ్డి మాట్లాడుతూ …ప్రభుత్వం నవరత్నాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చిందన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని తిరిగి ఆదరించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, తహసీల్దార్ కెవిప్రసాద్, వైస్ఎంపీపీ ఐ.వెంకటేశ్వరరెడ్డి, ఎంపీటీసీ యామర్తి ప్రభుదాసు ,ఈఓఆర్ కెజిఎస్ రాజు, మండల వ్యవసాయాధికారి బి.ప్రసాద్ రావు, మండల కోఆప్సన్ మెంబర్ కరిముళ్ల, ఏపీఎమ్ దేవరాజ్, డి ప్యూటీ తహసీల్దార్ ఇమ్మానియేల్ రాజు, సూపరిండెంట్ వజ్జా శ్రీనివాసరావు, సీనియర్ అసిస్టెంట్ పి.శ్రీనివాసరావు. గ్రామకార్యదర్శులు జె.లక్ష్మీకాంత్, ఏ.చిరంజీవి, విఆర్వో నాగలక్ష్మి, ఎమ్యల్వో మల్లేశ్వరరెడ్డి, సచివాలయసిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *