తాళ్లూరు ABC హైస్కూల్ విద్యార్థికి ప్రసన్నాంజనేయులకు IIIT లో సీటు

తాళ్ళూరు ABC హైస్కూల్ విద్యార్థి ముప్పనేని ప్రసన్నాయనేయులు Ongole IIIT కి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.వెంకటేశ్వరరావు తెలిపారు. తాళ్లూరు మండలం శివరాంపురం గ్రామానికి చెందిన సాధారణ రైతు కుటుంబానికి చెందిన ముప్పు నేని వెంకటేశ్వర్లు దంపతులకు ప్రసన్నాంజనేయులు మొదటి కుమారుడు .ఈ విద్యార్థి పదవతరగతి పబ్లిక్ పరీక్షలలో అత్యధికంగా 584 మార్కులు సాధించాడు. ఈనెల 25న ఇడుపుల పాయ IIIT లో విద్యార్థికి కౌన్సిలింగ్ ఉంటుందని ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు తెలిపారు. విద్యార్థి చిన్ననాటి నుండి ఏబీసీ హైస్కూల్లో విద్యను అభ్యసించి మొత్తం మార్పులు సాధించడంతోపాటు త్రిబుల్ ఐటీ సీటు సాధించడంపై పాఠశాల కరస్పాంటెంట్ టి. శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ కె. వెంకటేశ్వరరావు డైరెక్టర్ కె. కాలేషాబాబు, పాఠశాల ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థికి అభినందనలు తెలిపారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *