విద్యాదీవెనలో జాప్యం తగదు -జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్. లక్ష్మానాయక్

పేద విద్యార్థులకు సరైన సమయంలో విద్యాదీవెన అందించాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్. లక్ష్మానాయక్ సూచిం చారు. దర్శి గౌతమి కళాశాలలో నియోజకవర్గం లోని సంక్షేమం, విద్యా సహాయకులతో సమావేశం శనివారం జరిగింది. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్. లక్ష్మానాయక్ మాట్లాడుతూ …విద్యా సహాయకుల లాగిన్ వివిధ దశల్లో ఉన్న జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన మొదటి విడత ఫీజు తల్లి దండ్రులతో కాలేజీ వారికి చెల్లించేందుకు సహకరి చాలన్నారు. ఎస్సీ విద్యార్థులకు ఈకేవైసీ చేయించాలని సూచించారు. బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయించాలన్నారు. తల్లుల ఖాతాకు ఆధార్ అనుసంధానం చేయించడంపై అవగాహ కల్పించారు.
ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి లాగిన్ ఉన్న వాటిని త్వరితగతిన పరిష్కారం చేయాలని ఆదేశించారు. సాంఘిక సంక్షేమాధికారి షేక్ రబియా బేగం, వార్డెన్ రామకృష్ణారెడ్డి అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *