ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్‌ను సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడిన ఎఫ్‌పీవోల ప్రతినిధులు ఏమన్నారంటే…వారి మాటల్లోనే….
*సరస్వతి, సీఈవో, ఆరోగ్య మిల్లెట్స్ ఎఫ్‌పీవో, విజయనగరం జిల్లా*
సార్, మేం విజయనగరం జిల్లాలో ఆరోగ్య, చిరుధాన్యాల ఉత్పత్తిదారుల సంఘాన్ని నాబార్డు సహకారంతో ఏర్పాటు చేసుకున్నాం, అందులో 1500 మంది సభ్యులం, మా జిల్లాలో చిరుధాన్యాలు ఎక్కడ అమ్ముకోవాలో తెలీని పరిస్ధితుల్లో, చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో సీఎంగారు మా కష్టాలు గమనించి మా కష్టాలు తీర్చారు, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా రూ. 4 కోట్ల విలువైన యూనిట్ ఏర్పాటు చేశారు. మా మారుమూల ప్రాంతంలో ఏర్పాటుచేయడం విప్లవంలా అనిపించింది. మేం నేరుగా 30 మంది ఉపాధి పొందుతున్నాం, ప్రత్యక్షంగా 2 వేల మంది రైతులు, పరోక్షంగా 10 వేల మంది రైతులు లబ్ధిపొందుతున్నాం. మాకు అధికారులు చక్కగా సహకరించారు. గతంలో రైతులకు సలహాలు ఇచ్చేవారు లేరు కానీ ఇప్పుడు ఆర్బీకేల ద్వారా గ్రామంలోనే అన్నీ అందుతున్నాయి. సచివాలయ వ్యవస్ధ చాలా చక్కగా పనిచేస్తుంది, అన్నీ అందుతున్నాయి. మిల్లెట్ పండించే రైతులందరి తరపునా ధన్యవాదాలు.
*మేరి, కో ఫౌండర్, ద టింబక్తు కలెక్టివ్*
అందరికీ నమస్కారం, మేం గత 30, 35 ఏళ్ళుగా రైతులతో కలిసి పనిచేస్తున్నాం, రైతులతో కలిసి ధరణి అని ఎఫ్‌పీవో ప్రమోట్ చేస్తున్నాం. మేం సేంద్రీయ వ్యవసాయాన్ని, మిల్లెట్స్‌ను చాలా ప్రమోట్ చేస్తున్నాం, మేం ఏర్పాటు చేసిన సంఘాల సొసైటీలో 2 వేల మందికి పైగా రైతులు ఉన్నారు, 115 ఉత్పత్తులు తయారుచేసి 500 రీటెయిలర్స్ ద్వారా 13 రాష్ట్రాలలో వ్యాపారం చేస్తున్నాం. మేం ఆర్గానిక్ వెజిటెబుల్స్, ఫ్రూట్స్ ప్రారంభించాలనుకుంటున్నాం, ఇప్పుడు మాకు అవకాశం వస్తుంది, ధ్యాంక్యూ సార్.
*హరిబాబు, పలమనేరు రైతు ఉత్పత్తిదారుల సంస్ధ సీఈవో*
సార్, మేం పలమనేరులో కూరగాయలు పండించే రైతులతో నాబార్డు సహకారంతో ఒక రైతు సంఘాన్ని ఏర్పాటుచేసుకున్నాం, మేం రైతులు పండించే కూరగాయలను సార్టింగ్, గ్రేడింగ్ చేసుకుని కొన్ని కార్పొరేట్ సంస్ధలకు అందించేవారం, అలాంటి సమయంలో మా ఎఫ్‌పీవోను గుర్తించి ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్‌ను ఏర్పాటుచేశారు, సుమారు రూ. 4 కోట్లతో మిషనరీ, కోల్డ్ స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏర్పాటు చేశారు. 720 మంది రైతులు ఈ యూనిట్‌ను వినియోగించుకుని దళారీలతో సంబంధం లేకుండా నేరుగా తమ ఉత్పత్తులను ప్రాసెస్ చేసుకుంటున్నారు. మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. దాదాపు 1000 మంది రైతులు దీనిని వినియోగించుకుని లబ్ధిపొందుతున్నారు, ధ్యాంక్యూ సార్.






