వేపనూనె పిచికారీతో బహుళ ప్రయోజనాలు – వ్యవసాయ అధికారి ప్రసాదరావు

రైతులు సాగు చేసిన పైరు మొలకెత్తిన 30 రోజుల వ్యవ ధిలో రెండు సార్లు వేపనూనె పిచికారీ చేస్తే చీడపీడలను నివా రించవచ్చని వ్యవసాయాధికారి బి. ప్రసాదరావు అన్నారు. తాళ్లూరు మం డలంలోని బొద్దికూరపాడులో రైతులు సాగు చేసిన పొలాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు వరి, మొక్కజొన్న, సజ్జ పైర్లు సాగు చేశారని, ఆయా పైర్లపై రెండు పర్యాయాలు వేపనూనె పిచికారీ చేసుకుంటే అనవసరమైన రసాయన మందులు పిచికారీ చేయాల్సిన పని లేదన్నారు. పైరు తొలిదశలో ఎకరాకు లీటరు వేపనూనెను తగిన మోతాదులో నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. వీఏఏ అజ్మీర్, రైతులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *