బాలికపై వాలంటీర్ అత్యాచారయత్నం కేసు నమోదు అరెస్ట్

దర్శి మండలంలోని యర్రఓబనపల్లి పంచాయతీలో అగ్నిపురి కాలనీలో వాలంటీర్ గా పనిచేస్తున్న గుంటూరి అశోక్ బాలికపై బలవంతంగా అత్యాచారానికి యత్నించాడు. బాలిక ఫిర్యాదు మేరకు నింధితునిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. 3వ తేదీ 9 గంటల సమయంలో మైనరు బాలిక ఇంట్లో ఉండగా అశోక్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించాడు. కరెంట్ స్విచ్లు ఆపివేసి ఒక్కసారిగా ‘నా దగ్గరకు రా’ అంటూ బాలికను పట్టుకొనగా బాలిక భయపడి అరవడంతో చంపుతానని బెదిరించాడు. బాలిక బయటకు వచ్చి జరిగిన విషయం తల్లికి చెప్పింది. 4వ తేదీ బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ కు పంపినట్లు దర్శి ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *