కాపు సోదరుల ఆత్మీయ సమావేశం నిర్వహణ – ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదివారం కేపిహెచ్బి ఫంక్షన్ హాల్ లో జరిగిన కాపుల ఆత్మీయ సమయంలో పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కూకట్ పల్లి నియోజకవర్గంలో నివసిస్తున్న కాపు సోదరులు తనను ఎప్పుడూ సొంత తమ్ముడు భావించి అఖండ మెజారిటీతో గెలిపించారని ..అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులాలు, మతాలు కతీతంగా అందరం అన్నదమ్ముల వలే కలిసి ముందుకు వెళుతున్నామని అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచ స్థాయి నగరాల్లో హైదరాబాద్ మహానగరాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చారని అన్నారు… వివిధ ప్రాంతాల నుండి ఉద్యోగం ,వ్యాపారం రీత్యా హైదరాబాద్ మహానగరానికి వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్న వారందరూ కూడా తెలంగాణ బిడ్డలేనని అందరం ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా జీవిస్తున్నామని ఇలాంటి వాతావరణం కొనసాగించాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండాలని తెలిపారు..కాంగ్రెస్ బిజెపి పార్టీలు తమ పబ్బం గడుపుకోవడమే కానీ ప్రజల గురించి ఆలోచించే తత్వం లేదని ..కాంగ్రెస్ బిజెపి పార్టీలు పాలించిన రోజులు కూడా ఎలా ఉన్నాయో హైదరాబాద్ వాసులు గమనించారని అన్నారు. గతంలో కర్ఫ్యూలు బాంబుదాడులతో ఎక్కడ ఎలా ఉంటుందో అని ప్రజలు ఒనికి పోయేవారని ఈ పదేళ్ల కాలంలో ఎటువంటి సంఘటనను చోటుచేసుకోకుండా అందరం ఆప్యాయంగా శాంతిభద్రతలు నడుమ జీవిస్తున్నామని అన్నారు .తమ పూర్తి మద్దతు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు ప్రకటిస్తూ తీర్మానం చేశారు.. ఈ కార్యక్రమంలో.. మాజీ కార్పొరేటర్లు తూము శ్రావణ్ కుమార్ ,పగుడాల బాబురావు..కె. పి. హెచ్. బి ఇంచార్జ్ అడుసుమిల్లి వెంకటేశ్వరరావు..హెచ్ఎం మూర్తి, శ్రీనివాసరావు, రమణ ప్రసాద్ ,వలవల నాయుడు వాసు నాయుడు, భవాని, ధనలక్ష్మి ,సత్తిబాబు, పున్నారావు ,రంగమోహన్ రాజేష్, గుట్ట శంకర్ ,దినేష్ నాయుడు ,గంధం బాలకృష్ణ సిహెచ్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *