దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న పుట్లూరి కొండారెడ్డి ఇటీవల నూతనంగా ఏర్పాటు చేయబడిన రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైనారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, పుట్లూరి కొండారెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కొండారెడ్డి మాట్లాడుతూ …నాకు ఈ పదవి ఇచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. సహకరించిన సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరరావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి, ఏఐసీసీ సెక్రటరీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు సిరివెళ్ల ప్రసాద్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి, దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు సిరిమల్లె పౌలేష్ , దర్శి మండల అధ్యక్షులు కర్ణ పుల్లారెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగంపూడి బాలక్రిష్ణరెడ్డి ,యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కొప్పుల సాయి ,జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి కొప్పుల నరసింహ రావు ,సోషల్ మీడియా చైర్మన్ పారి కొండ గురవయ్య , బీసీ సెల్ అధ్యక్షులు శంకర్ , దర్శి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు , తాళ్లూరు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లోకిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ,ముండ్లమూరు ఎస్సీ సెల్ అధ్యక్షులు ప్రభుదాసు , దొనకొండ మండల అధ్యక్షులు చిన్న కోటయ్య , మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.





