శాంతిభద్రతల నిర్వహణ లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రధమ స్థానం – సనత్ నగర్ MLA అభ్యర్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

శాంతిభద్రతల నిర్వహణ లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందని సనత్ నగర్ MLA అభ్యర్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం రాత్రి రాంగోపాల్ పేట డివిజన్ లోని కళాసిగూడ లో బెంగాలి సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దసరా సమ్మెళన్ కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కొన్ని వర్గాల ప్రజలు కొంత ఆందోళనకు గురయ్యారని, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఆ అనుమానాలను తొలగించిందని చెప్పారు. వివిధ బాషలు, వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుండి వివిధ రకాల వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడ్డారని, వారందరిని తెలంగాణ బిడ్డలుగానే భావించి ప్రభుత్వం వారి అభివృద్దికి అన్ని విధాలుగా చేయూతను అందిస్తుందని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా జరుగుతున్నాయని అన్నారు. హైదరాబాద్ నగరం లో రోడ్ల అభివృద్ధి, ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ ల నిర్మాణం, పార్క్ ల అభివృద్ధి వంటి కార్యక్రమాలను చేపట్టి విశ్వనగరంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. సనత్ నగర్ నియోజకవర్గంలో 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధిని తొమ్మిదిన్నర సంవత్సరాలలో చేశామని తెలిపారు. తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాననే విషయం ప్రతి ఒక్కరికి తెలుసునని అన్నారు. బెంగాలి సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగేందుకు BRS పార్టీకి ఓటేయాలని కోరారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, సమాజ్ అద్యక్షులు షేక్ అబుల్ హుస్సేన్, మేహదుల్ కదుకా, సుమీర్ అల్డా, సుశాంత్ కంజీలాల్, ఉత్తమ్ బాబు, జగదీశ్ వర్మ, పబ్బా ప్రకాష్ తదితరులు పాల్గొన్నా

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *