న్యూ బోయిగూడలోని MNK విట్టల్ సెంట్రల్ కోర్టు అపార్ట్ మెంట్ లోపలు కాలనీలు, అపార్ట్ మెంట్ వాసులతో ఫెస్ టు ఫేస్ విత్ తలసాని ముఖాముఖి సమావేశం నిర్వహణ

న్యూ బోయిగూడలోని MNK విట్టల్ సెంట్రల్ కోర్టు అపార్ట్ మెంట్ లో పలు కాలనీలు, అపార్ట్ మెంట్ వాసులతో ఫెస్ టు ఫేస్ విత్ తలసాని ముఖాముఖి సమావేశం నిర్వహించారు. స్థానికులు తమ సమస్యలను ముఖ్య అతిథిగా హాజరైన
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వివరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కాలనీలు, అపార్ట్ మెంట్ వాసుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించామని అన్నారు. ఎన్నికల అనంతరం మరోసారి అన్ని విభాగాల అధికారులతో కలిసి తాను పర్యటించి, వారు చెప్పిన సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. విద్యావంతులైన వారు ఓటును వృధా చేయవద్దని అన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్లలో రాష్ట్రం, నగరం అద్భుతంగా అభివృధ్ధి చెందినదని, 2014 తరువాత నగరం ఎలా మారిందో అందరికీ తెలుసని అన్నారు. కాలని, అపార్ట్మెంట్ ప్రజలు ఈసారి తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ నెల 30వ తేదీన జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటువేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బన్సిలాల్ పేట్ డివిజన్ కార్పొరేటర్ కే. హేమలత, BRS పద్మారావు నగర్ ఇంచార్జీ జీ పవన్ కుమార్ గౌడ్, MNK విఠల్ సెంట్రల్ కోర్టు అపార్ట్ మెంట్ అద్యక్షుడు డాక్టర్ హనుమాండ్లు, కార్యదర్శి ఉమాశంకర్, బోయిగూడ రెసిడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర రావు, శ్రీనివాస్ గౌడ్, ప్రభావతి, ఏనుగు పుష్వంత్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు వెంకటేశం రాజు, కార్యదర్శి ఎం. మహేందర్, ఏసూరి మహేష్, శ్రీకాంత్ రెడ్డి, లంబు శ్రీను, అంబులెన్స్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. BRS నాయకులు తలసాని మహేష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, పలు కాలనీలు, అపార్ట్ మెంట్ల అధ్యక్షులు  హాజరయ్యారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *