పేదలు గొప్పగా ఉండాలనేది తమ లక్ష్యమని సనత్ నగర్ అసెంబ్లీ బి ఆర్ ఎస్ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పద్మారావు నగర్, నాగదేవత టెంపుల్, ఈశ్వరమ్మ బస్తీ, హమాలీ బస్తీ, చిదానందం కాలనీ తదితర ప్రాంతాలలో పాదయాత్ర గా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్ద మంత్రిని శాలువాలు కప్పి, పూలమాలలు వేసి, మంగళ హారతులు పట్టి ఘన స్వాగతం పట్టారు. ప్రచారంలో అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. ఈశ్వరమ్మ బస్తీ, పద్మారావు నగర్ ఏరియా బస్తీల్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించామని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మళ్ళీ వచ్చేది బి ఆర్ ఎస్ ప్రభుత్వమే కనుక మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని వెల్లడించారు. నిరుపేదలు అత్యధికంగా నివసించే హమాలీ బస్తీలో అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ఎన్నికలు పూర్తయిన తర్వాత చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు. బస్తీ వాసుల సౌకర్యార్ధం మీకు అందుబాటులో బస్తీ దవాఖానా ను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేయబడతాయని, మందులు కూడా ఉచితంగా ఇస్తారని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హమాలీ బస్తీ ప్రజల కోరిక మేరకు ఇటీవలనే పండుగ వాతావరణంలో ఎంతో ఘనంగా నూతన బొడ్రాయిని ప్రతిష్టించుకోవడం జరిగిందని చెప్పారు. మీకు ఏ అవసరం వచ్చినా…ఏ ఆపద వచ్చినా అన్నింటికీ నేను అండగా నిలుస్తూ వచ్చానని గుర్తుచేశారు. తాను ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వచ్చేవాడిని కాదని, నిరంతరం మీతోనే ఉంటాననే విషయం అందరికీ తెలిసిందే అన్నారు. మూడోసారి BRS ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 400 రూపాయలకే వంట గ్యాస్ సిలెండర్ అందజేయబడుతుందని, రేషన్ ద్వారా సన్నబియ్యం, 2 వేలు ఉన్న పెన్షన్ ను సంవత్సరానికి 500 రూపాయలు చొప్పున పెంచుతూ 5 వేల రూపాయల వరకు పెంచనున్నట్లు తెలిపారు. 15 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్న BRS పార్టీకి అండగా ఉండాలని కోరారు. ఒకే జెండా, ఒకే పార్టీ అనే నినాదంగా బస్తీవాసులంతా ఒకే మాటపై నిలవాలని పిలుపునిచ్చారు. ఈ నెల ౩౦ వ తేదీన జరిగే ఎన్నికలలో కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తామంతా మీ వెంటే అంటూ బస్తీవాసులు మంత్రి ఎదుట ముక్త కంఠంతో ప్రకటించారు. మంత్రి వెంట ప్రచారంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, పద్మారావు నగర్ BRS పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, బన్సీలాల్ పేట డివిజన్ అద్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు శ్రీకాంత్ రెడ్డి, ఏసూరి మహేష్, పాష, యాదగిరి యాదవ్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్, హమాలీ బస్తీ అద్యక్షుడు సుభాష్, సత్యనారాయణ, సంపత్ తదితరులు ఉన్నారు.
గులాబి పూలతో మంత్రికి స్వాగతం
పద్మారావు నగర్ లో ప్రచారం నిర్వహిస్తున్న సనత్ నగర్ MLA అభ్యర్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్థానిక సాయి విజ్ఞాన భారతి కాలేజి విద్యార్ధులు గులాబి పూల ను అందజేసి ఘన స్వాగతం పలికారు. కళాశాల కరస్పాండెంట్ సాయి మంత్రిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు. ఈ నెల ౩౦ వ తేదీన జరిగే ఎన్నికలలో కారు గుర్తుపై ఓటేయాలని ఇంటికి వెళ్ళిన తర్వాత మీ తల్లిదండ్రులకు చెప్పాలని విద్యార్ధులకు చెప్పారు.
అపార్ట్మెంట్ వాసులతో సమావేశం
తాను ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వచ్చే నాయకుడిని కాదని, నిరంతరం ప్రజల మద్య ఉంటూ సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తున్నానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పద్మారావు నగర్ లోని లక్ష్మి అపార్ట్మెంట్, సప్తగిరి అపార్ట్మెంట్ వాసులతో వేరువేరుగా సమావేశమైనారు. ముందుగా అపార్ట్మెంట్ వాసులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అపార్ట్మెంట్ వాసులు ఎప్పుడు తన వద్దకు వచ్చి ఏ సమస్య చెప్పినా పరిష్కరిస్తూ వచ్చానని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, వాటర్, విద్యుత్ వంటి అనేక సమస్యలు పరిష్కరిస్తూ వచ్చామని చెప్పారు. మరింత అభివృద్ధి కోసం కారు గుర్తుపై ఓటేసి మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, ఈ నెల ౩౦ వ తేదీన జరిగే ఎన్నికలలో ప్రతి ఒక్కరు పోలింగ్ కేంద్రానికి వెళ్ళి కారు గుర్తుపై ఓటేయాలని కోరారు. ఈ సమావేశంలో లక్ష్మి అపార్ట్మెంట్ అద్యక్షులు వామాక్షి దేవి, రామారావు, పుష్యంత్ రెడ్డి, వజీర్ మోహన్, సంజయ్, సప్తగిరి అపార్ట్మెంట్ వద్ద సమావేశంలో రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, వివేక్, అశ్విన్ కుమార్, వినయ్, వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.

