దశాబ్ద కాలంలో టిఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజలు గమనించాలి – పలు డివిజన్లోని అసోసియేట్ సభ్యులు , ప్రజలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ తో కలిసి సోమవారం ఫతేనగర్ డివిజన్లోని వివిధ కాలనీలు అసోసియేషన్ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.. ఇందులో భాగంగా ముందుగా భరత్ నగర్ లోని సీనియర్ సిటిజన్స్ తో సమావేశం నిర్వహించి అనంతరం జేపీ నగర్, భవాని నగర్, ఎల్బీఎస్ నగర్ ,ఇందిరా గాంధీపురం, సమతా నగర్ మొదలగు ప్రాంతాల్లో ఆయా కాలనీ ప్రజలతో మాట్లాడుతూ ఒకప్పుడు ఫతేనగర్ డివిజన్ ఏ విధంగా ఉంది…… ఇప్పుడు గల్లీ గల్లీకి సీసీ రోడ్లతో ఇంటింటికి మంచినీళ్లతో ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు …. అర్థం చేసుకోవాలని.. 60 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్, బిజెపి పార్టీలు ప్రజల గురించి ఆలోచించిన పాపాన పోలేదని కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల కాలంలో ఇంత అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. అంతే కాకుండా సంక్షేమ పథకాలైన కల్యాణ, లక్ష్మి షాదీ ముబారక్ ,పింఛన్లు వంటివి ప్రజలకు అందిస్తూ ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే దానిని పునరుద్ధరించే చర్యలతో ముందుకు వెళుతున్నామని.. నేడు శాంతిభద్రతలను కాపాడుకుంటూ ఎంతో హాయిగా జీవిస్తున్నామని…… కాంగ్రెస్ పరిపాలించిన రోజుల్లో ఎక్కడ ఏం జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపే వారమని అన్నారు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం అని పిలుపునిచ్చారు. మీరు వేసే ఓటు మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని ప్రతి ఒక్కరూ ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అలాగే హైదరాబాదులో మరో లక్ష డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తామని అర్హులైన ప్రతి ఒక్కరికి డబల్ బెడ్ రూమ్ అందుతుందని ఇందులో ఎటువంటి సందేహం లేదని ఆయన అన్నారు. తిరిగి మళ్లీ మన హైదరాబాద్ ను, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కారు గుర్తుకు ఓటు వేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నీ తిరిగి మళ్ళీ ఎన్నుకోవాలని కూకట్పల్లి నియోజకవర్గంలో తనను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని కోరారు…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *