ఆచార్య ఎన్టి రంగా ఉత్తమ నిస్వార్ధ సేవకుడని వక్తలు కొనియాడారు. ఆచార్య ఎన్ఆ రంగా భవన్ లో మంగళవారం ఆచార్య ఎన్టి రంగా 123 జయంతి సభను సంస్థ అధ్యక్షుడు ఆళ్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయకుమార్, ఎస్.జి ఫాలోయర్ రావు బాపయ్యలు పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు. 60 సంవత్సరాలు పాటు ఉత్తమ పార్లమెంటేరియన్గా, రైతు పక్షపాతిగా. ఆయన ప్రజాజీవితంలో నిస్వార్ధంగా పనిచేయుటకు ఎన్టి రంగా దంపతులు పిల్లలకు కూడ లేకుండా చేసుకుని ప్రజా సేవ చేసిన ఆయన జీవిత చరిత్రను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, రంగా ఫాలోయర్ రావుల బాపయ్య వివరించారు. అనంతరం ఉత్తమ పురష్కార ప్రధానాలు అందించారు. ఉత్తమ రైతుగా కొర్లపాటి ఐతమ్మ, ఉత్తమ ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంగా వెల్లల చెరువు అధ్యక్షుడు చింతా శ్రీధర్, ఉత్తమ పాల ఉత్పత్తి దారుల సహకార సంఘంగా అమ్మన బ్రొలు సంఘం అధ్యక్షుడు చంచు వెంకటేశ్వర్లు, ఉత్తమ ఎత్తిపోతల పథకం మక్కినేని వారి పాలెం ఎత్తిపోతల పథకం అధ్యక్షుడు నల్లమోటు వెంకటేశ్వర్లుకు, ఉత్తమ వ్యవసాయ శాస్త్ర విద్యార్థినిగా కుమారి అంబళ్ల రాజస్విని, ఉత్తమ వ్యవసాయ ఇంజనీరింగ్ విద్యార్ధి యేదికుర్తి విజయ శంకర్, ఉత్తమ పొగాకు రైతు అధ్యక్షుడిగా వెంపరాల బ్రహ్మా రెడ్డికి అందించారు. ముందుగా ఒంగోలు వ్యవసాయ మార్కేట్ కమిటి ఎదుట గల ఆచార్య ఎన్టి రంగా కాంస్య విగ్రహానికి ఆచార్య రంగా కిసాన్ సంస్థ ఆధ్వర్యంలో పూల మాలలు వేసి ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఆచార్య కిసాన్ సంస్థ అధ్యక్షుడు ఆళ్ల వెంకటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ చంచుశేషయ్య, ఉపాధ్యక్షులు నామినేని మోహనరావు, డాక్టర నాదేండ్ల చంద్రశేఖర్ రావు, కోశాధికారి గుండవరపుకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

