అంగన్వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి విడ తల వారీగా నగదు తీసుకుని మోసం చేసిన ఘటన దర్శిలో జరిగింది. బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలు గులోకి వచ్చింది. ఎస్సై డి. రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. దర్శి పట్టణానికి చెందిన డి. పద్మావతికి అంగన్వాడీ సూపర్వైజర్ ఉద్యోగం, పి. అనిల్ అనే వ్యక్తికి అంగన్వాడీ అసిస్టెంట్ సూపర్ వైజర్ ఉద్యోగం ఇప్పి స్తామని చెప్పి పట్టణానికి చెందిన ఎన్. కృష్ణవేణి అనే మహిళ ఇద్దరి వద్ద రూ.12,81,200 నగదును తీసుకున్నారు. సదరు వ్యక్తులు ఉద్యోగ విష యమై ఆమెను ప్రశ్నించగా మాయమాటలు చెబుతూ కాలం గడిపారు. అనుమానం వచ్చిన బాధితులు ఈ నెల 1న ఆమె ఇంటి వద్దకు వెళ్లి విచా రించగా, ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమ వద్ద నగదు తీసుకుని మోసం చేసిందని గ్రహించిన బాధితులు, డబ్బులు తిరిగి ఇవ్వాలని కృష్ణవేణి కుటుంబ సభ్యులను నిలదీయగా బెది రింపులకు దిగుతున్నారని వాపోయారు. సోమవారం బాధితులు జిల్లా ఎస్పీని కలిసి తమకు న్యాయం చేయాలని వినతిపత్రం అందించారు. మంగళవారం దర్శి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అంగన్వాడీ ఉద్యోగాల పేరిట మోసం – రూ.12.8 లక్షలు కాజేసిన మహిళ
08
Nov