రాష్ట్రం బాగుండాలంటే జగనన్నే మళ్లీ సీఎం కావాలి -దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్

రాష్ట్రం బాగుండాలంటే సీఎం వైఎస్ జగన్మో హన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ స్పష్టం చేశారు. దర్శి మండలంలోని దర్శి సచివాలయం-1, బొట్ల పాలెం గ్రామ సచివాలయాల పరిధిలో జగనన్నే మళ్లీ ఎందుకు సీఎం కావాలి అనే కార్యక్రమాలు నిర్వహిం చారు. జేసీఎస్ కన్వీనర్ ఎదురు కోటిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్యే మద్దిశెట్టి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సచివాలయాల పరి ధిలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం, నాడు-నేడు ద్వారా జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన లిస్టు బోర్డులను ఎమ్మెల్యే ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ… రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇచ్చిన మాటకు కట్టబడి హామీలు అమలు చేసేవారే కావాలన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు 600 హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయకుండా మేనిఫెస్టోనే మాయం చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని, ప్రజలను నిలువునా మోసం చేశారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పని మడమ తిప్పని నేత అని కొనియా డారు. ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన నేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. టీడీపీ హయాంలో నెలలో ఎన్నికలు వస్తాయనగా రూ.1000 పింఛను రూ.2 వేలు చేశారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి రెండు వేలు ఉన్న పింఛను పెంచుకుంటూ ఇప్పుడు రూ.2,750 ఇస్తున్నారని, జనవరి నుంచి రూ.3 వేలు ఇస్తారని చెప్పారు. గ్రామాల్లో సచివాలయాల వ్యవస్థ ద్వారా సమస్యలు అక్కడే పరిష్కారం అవుతున్నాయ న్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేశాయన్నారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రం లో జగన్ తీసుకున్న నిర్ణయాలు ఇతర రాష్ట్రాల ప్రశంసలు సైతం అందుకున్నాయని గుర్తుచేశారు. చింతల పాలెంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగుర వేశారు. కార్య క్రమంలో ఎంపీపీ సుధా అచ్చయ్య, నగర పంచాయతీ కమిషనర్ మహేష్, ఎంపీపీ కుసుమకుమారి, మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, రెడ్డి సం క్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతి రెడ్డి, కౌన్సిలర్లు మేడం మోహన్ రెడ్డి , వీసీ రెడ్డి, తుళ్లూరి బాబూరావు, జగన్నాథం మోహన్ బాబు, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్, సొసైటీ అధ్యక్షుడు వేమిరెడ్డి చెన్నారెడ్డి, సర్పంచ్ లు రాము, సుబ్బారెడ్డి, కర్ణా భాస్కర్ రెడ్డి , వలి, గంజి వెంకటేశ్వరరెడ్డి, కరిపిరెడ్డి సుబ్బారెడ్డి, రామకృష్ణ, పుట్ట రవి, కొండలు, గంగిరెడ్డి పాలెం యలమందారెడ్డి, పాపిరెడ్డి, శ్రీని వాసరెడ్డి, రామాంజి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *