ఈ ఎన్నికలలో తనను భారీ మెజార్టీ తో గెలిపిస్తే కూకట్ పల్లీ రూపు రేఖలు మారుస్తానని బీ జె.పి,జన సేన ఉమ్మది అభ్యర్థి మమ్మా రెడ్డి ప్రేమ్ కుమార్ ఓటర్లను అభ్యర్ధించారు.పాదయాత్ర లో భాగంగా గురువారం ఓల్డ్ బోయిన్ పల్లి,మేడ్చల్ జిల్లా (అర్బన్),బిజెపి కార్యాలయం ప్రాంతాల్లో నిర్వహించారు.ఈ సందర్భంగా ముమ్మా రెడ్డి మాట్లాడుతూ ….కూకట్ పల్లీ నియోజక వర్గం లోని ఓటర్లు ఎంతో విజ్ఞులు అని…ఈ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తు పైన ఓట్లు వేసి తనను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ముందుగా కూకట్ పల్లీ లో ట్రాఫిక్ సమస్య లేకుండా పరిషరిస్తా అన్నారు.అలాగే ప్రాధాన్యతా క్రమంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను అన్నారు.





