డీలర్లు నిబంధనలు పాటించాలి – డీలర్ల సమావేశం నిర్వహణ

ఎరువులు పురుగమందుల దుకాణాల డీలర్లు నిబంధనలు తప్పక పాటించాలని ఒంగోలు ఎడీఏ రమేష్ బాబు అన్నారు. స్థానిక ఎడీఏ కార్యాలయంలో శనివారం ఒంగోలు డివిజన్ పరధిలోని ఫెర్టిలైజర్స్ దుకాణా డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడీఏ రమేష్ బాబు మాట్లాడుతూ డీలర్లు తప్పనిసరిగా స్టాకు రిజిస్టర్, బిల్ బుక్స్ సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. స్టాకు వివరాలు నోటీస్ బోర్డులో ఎప్పటికప్పుడు నమోదు చెయ్యాలని కోరారు. ఎంఆర్పీ ధరలకు మించి అమ్మినట్లయితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. బయో ఫెర్టిసైడ్ అనుమతి ఉన్నవారు అమ్మలని కోరారు. ప్రతి డీలర్ అర్హత పత్రాలను సాధించాలని లేదంటే జనవరి నుండి లైసెన్స్ రద్దు చేస్తామని అన్నారు. సంఘ బాధ్యుడు రమణా రెడ్డి, డివిజన్ పరధిలోని వ్యవసాయాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *