జాతీయస్థాయి మిల్లెట్ శిక్షణకు తాళ్లూరు వ్యవసాయ అధికారి ప్రసాదరావు

జాతీయ స్థాయి మిల్లెట్ శిక్షణ కార్యక్రమంలో తాళ్లూరు మండల వ్యవసాయాధికారి బీ ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు హైదరాబా ద్లో జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రైనింగ్ ప్రోగ్రాం ఆన్ మిల్లెట్ బేస్డ్ వాల్యూచైన్ డెవల ప్మెంట్ (చిరుధాన్యాలకు విలువ ఆధారిత గొలుసు అభివృద్ధిపరిచే శిక్షణ) కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రసాదరావును ఎంపిక చేశారు. ప్రసాదరావు రాష్ట్రంలోనే అత్యుత్తమంగా చిరుధాన్యాల సాగుపై వందల మంది రైతులకు అవగాహన కల్పించి ప్రతికూల పరిస్థితుల్లోనూ సాగు చేసేలా చర్యలు తీసుకున్నారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ఐవైఎం 2023లో భాగంగా మినీకిట్లు పంపిణీ చేయడం, చిరుధాన్యాల పొలంబడులు నిర్వహించడం పం ట కోత ప్రయోగాలు, నిల్వలు తగు జాగ్రత్తలు పాటించడం, పోషక విలువలపై వేలాది మంది విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించినందుకు ప్రసాదరావును ఎంపిక చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *