రోయ్యల రైతుల సంఘం జిల్లా నూతన కమిటి ఎన్నిక

ప్రకాశం జిల్లా రొయ్యల రైతుల సంఘం నూతన కమిటీని ఎకగ్రీవంగా ఎన్నిక జరిగినది. ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో రొయ్యల రైతుల ఫెడరేషన్ సమావేశం నిర్వహించారు. రోయ్యల రైతుల ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు ఐవీఆర్ మోహన్ రాజు, రాష్ట్ర అధ్యక్షుడు కె బాస్కర్ రాజు సమక్షంలో ఎన్నిక జరిగింది. సంఘ గౌరవ అధ్యక్షుడిగా చేపల రమణయ్య, సంఘ జిల్లా అధ్యక్షుడిగా దుగ్గినేని గోపినాథ్, ప్రధాన కార్యదర్శిగా కె సుబ్బా రెడ్డి, ట్రెజరర్ గా మద్దినేని ఆంజనేయులు, ఉపాధ్యక్షులుగా శింగంనేని అంజిబాబు, నార్నే రమేష్ బాబు, పమిడి సుబ్బా నాయుడు, సహాయ కార్యదర్శులుగా యూఎస్ రాజు, చేపల శ్రీను, షేక్ సలాం, కమిటీ కార్యవర్గసభ్యులుగా చేపల శ్రీనివాసరావు, ఎం వెంకటేశ్వర్లులను ఎన్నుకున్నారు. రొయ్యల రైతులు ఏసమస్య ఎదురైన కమిటీ బాధ్యులు చిత్త శుద్దితో పనిచెయ్యాలని జాతీయ అధ్యక్షుడు ఐవీఆర్ మోహన్ రావు కోరారు. తమకు అవకాశం కల్పించినందుకు నూతన కమిటీ సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు. చిత్తశుద్దితో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సభ్యులకు హామీ ఇచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *