డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ మద్దిశెట్టి రేణుక దంపతుల ఎకైక కుమారై డాక్టర్ హారిక వివాహ వేడుక సందర్భంగా వారి కుటుంబంలో పెళ్లి సందడి మొదలైనది. వివాహం హైదరాబాద్ లోని నార్సింగిలో కల ఓం కన్వేన్షన్ నిర్వహిస్తుండగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి అభిమానులు, పలువురు ప్రజాప్రతినిథులు అధిక సంఖ్యలో వెళ్లారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్, ఆయన సోదరులు మద్దిశెట్టి రవీంద్ర, మద్దిశెట్టి శ్రీధర్, మద్దిశెట్టి వాసులు వారి కుటుంబసభ్యులతో శాస్త్రయుక్తంగా, లాంఛనంగా నిర్వహించిన పలు కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, మాజీ ఎమ్మెల్యేలు కదిరి బాబు రావు, జనార్ధన్లో పాలు పలువురు ప్రముఖలు పాల్గొని నూతన వధూవరులు డాక్టర్ హారిక, డాక్టర్ సాయి దినేష్ లకు తమ దీవేనలు అందించారు. అధిక సంఖ్యలో ప్రముఖులు, పలు పార్టీలకు చెందిన నేతలు రావటంతో రాజకీయ సందడి నెలకొన్నది. నియోజక వర్గంలోని ప్రజా ప్రతినిథులు, పార్టీ బాధ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






